నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని, అర్సపల్లి ఆర్ఓబి నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్ కి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశించారు.
ఇవ్వాల (గురువారం) జిల్లా కేంద్రంలోని స్థానిక అర్సపల్లిలో ఆర్ఓబి నిర్మాణ పనులను పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.పీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ సంక్షేమమే ధ్యేయంగా మహర్నిశలు పాటు పడుతుందన్నారు. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల కోసం ప్రభుత్వం రూ.137 కోట్ల నిధులను కేటాయించిందని చెప్పారు. ఆర్ఓబి పనులు సంవత్సరం నర లోపు పూర్తి చేసేలా చూడాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ల ను ఆదేశించారు.
అలాగే మాధవ నగర్, ఊరు మామిడిపల్లి ఆర్ఓబి పనులు తుది దశలో ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన నిధులతో పనులకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. మాధవ్ నగర్ ఆర్వోబి పనులు సైతం కొనసాగుతున్నాయని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఫ్లవర్ లీడర్ స్రవంతి రెడ్డి కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బిజెపి నాయ కులు,కార్పొరేటర్లు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.