Tuesday, November 19, 2024

KTR: కాంగ్రెస్ తీరుపై కెటిఆర్ గ‌రం గ‌రం ..రుణ మాఫీ, రైతు బంధు 15వేలు ఎక్క‌డంటూ నిల‌దీత

హైదరాబాద్‌: సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏనాడూ పద్దులపై చర్చ జరగలేదన్నారు. శాసనసభ ఆవరణలో మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు.

అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల‌లో 2 ల‌క్ష‌ల రుణ మాఫీ, రైతుబంధు రూ 15వేలు వంటి అమ‌లు చేస్తామ‌ని ఇచ్చిన హామీలు ఎమ‌య్యాయని ప్ర‌శ్నించారు.. ముందు చూపు లేకుండా అల‌విగాని హామీలు ఇచ్చి మా ప్ర‌భుత్వాన్ని త‌ప్పు ప‌ట్ట‌డం ఏమిట‌ని నిల‌దీశారు.. అప్పులు కుప్పంగా మార్చామ‌ని అంటున్న కాంగ్రెస్ నేత‌లు ప్ర‌తి ఏటా తాము ప‌ద్దుల‌పై విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రాలు చూడ‌లేద‌ని అంటూ ఫైర్ అయ్యారు.. ఇదే స‌మ‌యంలో తమ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌, లెక్క‌ల‌పై ప్ర‌తి ఏటా కాగ్ త‌న నివేదిక ఇస్తున్న‌ద‌ని అన్నారు .. వాస్త‌వాలు గ‌మ‌నించ‌కుండా త‌మ‌పై నింద‌లు వేస్తే దానికి గ‌ట్టిగానే స‌మాధానం చెపుతామ‌న్నారు.. ‘‘మేం ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశాం. ప్రతి ఏడాది కాగ్‌ నివేదికలు ఇస్తోంది.. ఆడిట్‌ లెక్కలు తీస్తున్నారు. అలాంటప్పుడు లెక్కలు వేసుకుని హామీలు ఇస్తారా? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు అప్పగించారని ఇక కాంగ్రెస్‌ నేతలు చెప్తారు. కాంగ్రెస్‌ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement