Friday, November 22, 2024

నవంబర్‌లో డబుల్‌ హ్యాపీ

సిద్దిపేట ప్రతినిధి (ప్రభ న్యూస్‌) : జిల్లాలో వివిధ దశల్లో ప్రగతి లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను వీలై నంత త్వరగా పూర్తి చేసి నవంబర్‌ మొద టివారంలోగా ప్రారంభోత్సవం కు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రా మి రెడ్డిఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో ఇండ్ల నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రి య, మౌలిక సదుపాయాల కల్పన పై రెవెన్యూ డివిజన్‌ అధికారులు, రహదా రులు, భవనాలు, పంచాయితీ రాజ్‌ ఇంజనీరింగ్‌ పర్యవేక్షక, కార్యనిర్వహక ఇంజనీర్‌లు, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్‌ లతో కలెక్టర్‌ కార్యాలయం లో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌ లో ఇప్పటికే 6715 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు గ్రౌండింగ్‌ కా గా, 5555 ఇండ్లు పూర్తయ్యాయని, 116 2 ఇండ్లు ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు.పూర్తి అయిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల లో ఇప్పటికే పలు ఇండ్లు పంపిణీ చేయగా మిగతావి పంపిణీ చేయాల్సి ఉందన్నారు.ప్రగతి లో ఉన్న ఇండ్లను సైతం ప్రారంభోత్స వాలు కు సిద్ధం చేయాల్సి ఉందన్నా రు.పూర్తయిన, ప్రగతిలో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కాలనీల లో విద్యుత్‌, త్రాగునీరు, రోడ్లు తదితర ఇన్‌ ప్రా స్ట్రక్చ ర్‌ గ్యాప్‌ లేకుండా చూడాలని ఇంజనీరిం గ్‌ అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పన లో నిర్లక్ష్యం చేసే గుత్తేదారు లను తప్పించి…బాగా పని చేసే కాంట్రాక్టర్‌ లకు అప్పగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే అన్ని మౌళిక సదుపాయాల తో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిన ఇండ్లు, ఇండ్ల నిర్మాణం పూర్తి కాబడి మౌళిక సదుపాయాల కల్పన పెండింగ్‌ లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం లకు లబ్దిదారుల ఎంపిక ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేపట్టాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల ప్రారం భోత్సవాలు 10 రోజుల గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలన్నారు.హామీ ఇచ్చిన తేదీకి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం ను ఇంజనీరింగ్‌ అధికారులు, లబ్ధి దారుల ఎంపిక ను తహశీల్దార్‌ లు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్‌ ఆదేశించా రు.లేదంటే బాధ్యులు పై చర్యలు త ప్పవని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement