హైదరాబాద్, : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి సమయం ఆసన్నమవు తోంది. త్వరలో తెలంగాణ శాసనమండలికి ఆరు స్ధానాలు ఖాళీ కానుండగా, మే 3 తర్వాత ఎపుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని శాసనమం డలి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 4తో ముగియనుండగా, వీటి భర్తీకి సంబం ధించి ఇప్పటికే షెడ్యూల్ రావాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ వ్యవహారం ముగిశాక ఎన్నికల కమిషన్ వీటిపై దృష్టి పెట్టను న్నారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, చీఫ్ విప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, ఆకుల సుజాత, ఫరీదుద్దీన్‌ల పదవీకాలం జూన్ 4తో ముగుస్తోంది. ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ 30 నుండి 45రోజుల ముందు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోం ది. ఈ క్రమంలో మే 4 తర్వాత నోటిఫికేషన్ వస్తుం దని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలే ఓట్లు వేసే ఎన్నిక కావడంతో.. వీటి భర్తీకి మరో పదిరోజుల్లోనే షెడ్యూల్ ఖాయమని ఆశావహులు భావిస్తున్నారు.
శాసనమండలిలో ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి.. వచ్చే అసెంబ్లి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎంపికలు చేయనున్నారు. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్‌తో సహా అన్ని ఎన్నికలకు ఏప్రిల్ 30తో తెరపడనుండగా, ఈ సారి అభ్యర్ధుల ఖరారులో అనేక సంచలనాలు ఉండే అవకాశముందని పార్టీ వర్గా లు భావిస్తున్నాయి. మండలి ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి రెన్యువల్ పై ఆసక్తి నెలకొంది. మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ల పదవీకాలం ముగుస్తున్న నేప థ్యంలో మండలి స్వరూపం కూడా మారనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబం ధించిన ఆరు స్థానాల్లో రెడ్డి ఒకటి, మున్నూరు కాపు 2, మైనారిటీ 1, ఎస్సీ 1, పెరిక-1 ఉన్నారు. డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్‌కు ఇప్పటికే ఒకసారి రెన్యువల్ చేసినందున ఈ సారి అవకాశం ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలిత పదవీకాలం కూడా ముగుస్తోంది. నిజామాబాద్‌కు చెందిన లలిత కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో రెన్యువల్ హామీ లభించింది. సీఎం కేసీఆర్ హామీనిచ్చిన అందరికీ రెన్యువల్ చేశారు. అదే పంథాలో ఆకుల లలితకు రెన్యువల్ ఖాయమన్న చర్చ పార్టీలో ఉంది. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి రెన్యువల్ చేస్తారా లేదా వచ్చే అసెంబ్లి, లోక్ సభ స్థానాల్లో ఏదో ఒక దానిపై హామీనిస్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కడియం రెన్యువల్ ఆధారంగా వరంగల్ రాజకీయాల్లో మార్పుచేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఇపుడు వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సీఎం ఆదేశాల మేరకు కడియం గట్టిగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఫరీదుద్దీన్‌కు రెన్యువల్ ఉంటుందా లేదా.. అన్నది చూడాల్సి ఉంది. మండలి చీఫ్‌విప్‌గా ఉన్న బోడకుంటి వెంక టేశ్వర్లు గతంలో ఒకసారి రెన్యువల్ చేసినందున మరోసారి రెన్యువల్ చేస్తారా.. ఆ స్థానంలో మరో బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తారా అన్న చర్చలు పార్టీవర్గాల్లో జరుగుతున్నాయి. ఖాళీ కానున్న ఆరు స్థానాల్లో కనీసం మూడు స్ధానాల్లో కొత్తవారికి అవకాశం లభిస్తుందని చర్చ జరుగుతోంది. ఇదే సంద ర్భంలో .. మండలి స్వరూపం కూడా మారే అవకాశం కనబడుతోంది. 2023 అసెంబ్లి ఎన్నికలు, ఆయా జిల్లాల అవసరాలు.. సమీకరణాల ఆధారంగానే నేతలకు అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. సీఎం ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్..
Advertisement
తాజా వార్తలు
Advertisement