తెలంగాణ రాష్ట్రంలోని వైద్య, దంత కళాశాలల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ మంగళ వారం జారీచేసింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్ 2021లో అర్హత సాధించిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ వెల్లడించింది.
జనవరి 5 నుంచి 11వ తేది సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నిర్ధేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని యూనివర్సిటీ కోరింది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించిన అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటి వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital