Tuesday, November 19, 2024

పీజీ కన్వీనర్ కోటా సీట్లభర్తీకి నోటిఫికేషన్.. 2న వెబ్ ఆప్షన్లు

వరంగల్, ప్రభ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ‌లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ వైద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పైనల్ మాప్ ఆప్ విడత కౌన్సెలింగ్ త‌ర్వాత‌ ఖాళీగా ఉన్న పీజీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి యూనివర్సిటీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

మే 2వ తేదీన ఉదయం 8 గంటల నుంచి, మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. గత విడత కౌన్సెలింగ్ లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా.. అదే విధంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు అనర్హులుగా పేర్కొంది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement