Notice Draft – ములుగు జిల్లాకు ‘సమ్మక్క, సారలమ్మ’ పేరు

ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క, సారలమ్మ’ జిల్లాగా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

Exit mobile version