Friday, November 22, 2024

TS: కేసీఆర్ హ‌యాంలో ఉపాధి క‌ల్ప‌న త‌ప్ప.. కొత్త‌గా జ‌రిగిందేమీ లేదు… కేటీఆర్

పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ హయాంలో కొత్తగా జరిగిందేమీ లేదని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు మాత్రమే ఉన్న రాష్ట్రాలు దేశంలో తెలంగాణ తప్ప వేరే ఏవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. అటెండర్ మొదలు గ్రూప్‌ వన్ ఉద్యోగాల వరకు 95 శాతం స్థానికులకే సాధించిన ఘనత కేసీఆర్‌ది మాత్రమేనని చెప్పారు.

2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం 2,32,308 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. విశ్వ విద్యాలయాలకు ఉమ్మడి నియామక బోర్డు తలపెడితే అప్పటి గవర్నర్ అడ్డుపడ్డారని, 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకోవడం ముఖ్యమంత్రి రాజకీయ దివాళా కోరుతనంగా అభివర్ణించారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక అన్నీ మోసాలేనని కేటీఆర్ ఆరోపించారు. బిల్డర్లపై ఆర్, బీ, యూ ట్యాక్స్‌లు వేస్తున్నారని, రేపో మాపో ఎక్సైజ్ దుకాణం తెరిచి జూపల్లి ట్యాక్స్ కూడా వస్తుందని అంటున్నారని వ్యాఖ్యానించారు. దిల్లీకి సామంత రాజుల్లా కప్పం కడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement