Friday, November 22, 2024

నేటి నుంచి నోట‌రీ సేల్స్ స్థ‌లాల రెగ్యుల‌రైజ్ రిజిస్ట్రేష‌న్స్ – క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ పాటిల్

సిద్దిపేట – నోటరీ ద్వారా పట్టణ ప్రాంతాలలో కొన్న స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోవడానికి జిఓ ఎంఎస్ 84 ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ ఒక ప్రకటనతెలిపారు. ఎలాంటి స్టాంపు డ్యూటీ చెల్లించకుండా కేవలం నోటరీ ద్వారా పట్టణ ప్రాంతాల్లో కొన్న స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని 125 చదరపు గజాలు మరియు అంతలోపు ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించేందుకు స్టాంప్ డ్యూటీ మరియు పెనాల్టీ ఉండదని, 125 చదరపు గజాలకు పైన 3000 చదరపు గజాల లోపు ఉన్న భూమికి మార్కెట్ వాల్యూ ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.


జీవో ఎంఎస్ 84 ప్రకారం దరఖాస్తు చేసుకునేవారు

  1. నోటరీ చేసిన డాక్యుమెంట్స్
  2. లింక్ డాక్యుమెంట్స్
  3. ప్రాపర్టీ టాక్స్ రసీదు
  4. ఎలక్ట్రిసిటీ బిల్ రషీద్
  5. వాటర్ బిల్ రషీద్
  6. ఇతర ఏమైనా రసీదులు ఉంటే వాటితో 1 ఆగస్టు 2023 నుండి 3 నెలలలోపు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement