రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.102 కోట్లతో చేపట్టిన పలు పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్ రావు మాట్లాడారు. ఓ పార్టీలో ఓటుకు నోటు ఉంటే… ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రూ.2,500 కోట్లు ఇస్తే వస్తదట అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ మాట మనం అనడం లేదని, కర్ణాటక బీజేపీ ఎంపీనే చెబుతున్నాడని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరో మీకు తెలుసన్న హరీశ్.. ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి అని పేర్కొన్నారు. ఇలాంటి పార్టీలతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందా ? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారని.. మరోసారి టీఆర్ఎస్ ను గెలిపించాలని అన్నారు.
ఒక పార్టీలో ఓటుకు నోటు.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు : విపక్షాలపై మంత్రి హరీశ్ రావు
Advertisement
తాజా వార్తలు
Advertisement