హైదరాబాద్ : కాళేశ్వరంపై న్యాయ విచారణను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు మ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ అడ్డుకుంటున్న విధానానికి బీజేపీకి కూడా సపోర్ట్ చేస్తోందని అన్నారు. జ్యూడీషియల్ ఎంక్వైరీ చాలా పారదర్శకమైనదని అభిప్రాయపడ్డారు.
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబోతున్నామని చెప్పారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్, మోసగాడు కేటీఆర్ అని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
నెల రోజుల్లోనే హామీలను అమలు చేయలేదంటూ, కాంగ్రెస్‌ను 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మొదటగా దళితులను మోసం చేశారని మండిపడ్డారు.
అనంతరం దళితులకు మూడు ఎకరాల భూమి అని మోసం చేసింది మీరే నంటూ ఫైర్ అయ్యారు. ‘మీరిచ్చిన హామీలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి కేటీఆర్’ అంటూ ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లలో నగరంలో తప్ప ఎక్కడైనా ఇళ్లు కట్టారా అంటూ ప్రశ్నించారు. డబుల్ రూం ఇళ్లంటూ గాలి మాటలు చెప్పి పదేళ్లు ప్రజలను మోసం చేశారంటూ కెసిఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.