వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్.. బంగారు భారత్ ప్రకటనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రలో ఎలా కలుపుతారని.. అది సాధ్యమా? అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు విలీనంపై కేటీఆర్ మాట్లాడారని షర్మిల విమర్శించారు. హైదరాబాద్ లోటస్పాండ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ…
“బంగారు తెలంగాణ కాదు… ఇది బానిసత్వపు తెలంగాణ. తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు, అది సాధ్యమా.? ప్రజలను రెచ్చగొట్టేందుకు కేటీఆర్ విలీనం గురించి మాట్లాడారు. బంగారు తెలంగాణ కాదు… ఇది బానిసత్వపు తెలంగాణ. 59 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తించట్లేదు. ఎల్ఐసీలో 70 ఏళ్లు పైబడిన వారికీ పాలసీలు ఉన్నాయి. రైతులందరికీ బీమా వర్తింపజేయాలని హైకోర్టును ఆశ్రయించాం. 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.” -వైఎస్ షర్మిల అన్నారు. 59 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తింపచేయడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 66 లక్షల మంది అన్నదాతలు ఉంటే 41 లక్షల మందికే పథకం అమలవుతోందని ఆరోపించారు. 59 ఏళ్ల లోపే రైతులు చనిపోవాలని ప్రభుత్వం భావిస్తోందా? అని షర్మిల నిలదీశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital