Tuesday, December 10, 2024

TG | ఆపన్న హస్తం కాదు… భాస్మాసుర హస్తం : ఎమ్మెల్యే ధన్పాల్

నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : కల్లబొల్లి మాయ మాటలు చెప్పి.. ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిందని, కాంగ్రెస్ ది ఆపన్న హస్తం కాదు… భాస్మాసుర హస్తమని అర్బన్ ఎమ్మెల్యే దండాల సూర్యనారాయణ అన్నారు.

కాంగ్రెస్ సంవత్సర పాలనలో ప్రజలకు ఏమి చేశారని విజయవత్సవాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తీర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు అబద్దలు అరవై ఆరు మోసలకు నిరసనగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ప్రజలు గోస పడి మార్పు కోసం అని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అమలు చేస్తానన్న గ్యారంటీలు, హామీలు ఏడాది పాలన పూర్తి అవుతున్న ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు.

కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి, నియంతల వ్యవహారించి దశబ్ది ఉత్సవాలు జరిపితేనే ప్రజలు తగిన బుద్ది చెప్పి ఫామ్ హౌస్ కి పరిమితం చేసిర్రు అని విమర్శించారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి పోయినోడి జుట్లనుండి తెలిండని ఏడాదికే విజయోత్సవాలు అని ప్రజాధనం వృధా చేయడం మొదలు పెట్టిండు అన్నారు.

దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ వస్తాడో.. ఇంచార్జ్ మంత్రి వస్తాడో చర్చకు రమ్మని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా తను కాంగ్రెస్ ఏడాది పాలన 6 అబద్దాలు 66 మోసాలను బయట పెట్టడానికి సిద్ధం ఉన్నానని సవాల్ చేసాడు. ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే గా ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ నాయకుల అవినీతి అక్రమాలు సాగ వు,సాగనివ్వనని హెచ్చ రించారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని పాలన పైన దృష్టి పెట్టాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ డిమాండ్ చేసా రు. లేదంటే కెసిఆర్ కి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించా రు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్పొరేటర్లు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement