హైదరాబాద్, ఆంధ్రప్రభ : బండి సంజయ్ కాదు బంగి సంజయ్, నీకు ఆర్డీఎస్ కొన తెల్వదు .. మొన తెల్వదు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు తెల్వవు, రిజర్వాయర్లు తెల్వవని ఎత్తిపొడిచారు. కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం కూడా ఆయనకు తేదని విమర్శించారు. ఆరు నెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తి చేస్తావో చెప్పాలని, ప్రజలకు కాగితంపై రాసిస్తావా అని ప్రశ్నించారు. శుక్రవారం బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఏ పనులు చేపడతావ్ ? ఎక్కడ నుండి నిధులు తెస్తావో ప్రజలకు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, డీకె అరుణ కర్నాటక బీజేపీ ఇంచార్జ్. ఇద్దరూ కలిసి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు కర్నాటకను ఒప్పించి సాగునీరు తెచ్చే దమ్ముందా ? అని నిలదీశారు. ఆర్డీఎస్ కాలువను నిజాం ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టు పనులు 1946లో మొదలై 1958లో పూర్తయిందన్నారు. తుంగభద్ర నదిపై రాయచూర్ జిల్లా మాన్వి వద్ద నిర్మించిన అంతర్ రాష్ట్ర ప్రాజెక్టుగా ఇది పేరుగాంచిందని, దీనిద్వారా 93,379 ఎకరాల ఆయకట్టు సాగవుతుందన్నారు. క్రిష్ణా వాటర్ ట్రిబ్యునల్ 1 ఆర్డీఎస్ కు 17.1 టీఎంసీల నీటిని కేటాయించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ పొడవు 142 కిలోమీటర్లు అని, మొదటి 42 కిలోమీటర్లు కర్ణాటకలో, తదుపరి 100 కిలో మీటర్లు తెలంగాణలో ప్రవ#హస్తుందని చెప్పారు. దీని ద్వారా అలంపూర్ నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరు అందించడం ప్రధాన ఉద్దేశంగా ఉన్నదని తెలిపారు. కానీ ఆర్డీఎస్ కాలువ ద్వారా ఎన్నడూ కర్ణాటక సంపూర్ణంగా నీరిచ్చిన ధాఖలాలు లేవని, అలంపూర్ తాలూకాలలో 87,500 ఎకరాల ఆయకట్టుకు 15.9 టీఎంసీల నీరందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎన్నడూ 20 వేల ఎకరాలకు నీళ్లు పారలేదన్నారు.
ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మద్దతుగా 2003 జులై 16న అలంపూర్ జోగుళాంబ ఆలయం వద్ద మొదలుపెట్టి జులై 25 వరకు సీఎం కేసీఆర్ పాదయాత్ర నిర్వ#హంచారని, గద్వాలలో లక్ష మందితో బ#హరంగసభ నిర్వ#హంచి పాదయాత్ర విరమించారని గుర్తు చేశారు. ఆయన పాదయాత్ర నేపథ్యంలో వెనువెంటనే 2003 ఆగస్టు నెలలో ఆర్డీఎస్ ఆయకట్టు రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై ఉమ్మడి రాష్ట్రంలోని ఎంపీలందరికీ కేసీఆర్ బ#హరంగ లేఖ రాశారని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ చర్యల ద్వారానే ఆర్డీఎస్ సమస్యపై 2004 లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసిందని చెప్పారు. ఆ కమిటీ తెలంగాణకు ఆర్డీఎస్ ద్వారా సాగునీరు అందడం లేదని నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ తర్వాత 2014 వరకు ఎటువంటి చర్యలు లేవని, ఈ విషయమై అనేకమార్లు టీఆర్‌ఎస్ ఆర్డీఎస్ ఆయకట్టుపై ఉద్యమించిందని స్పష్టం చేశారు.
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్ మీద సంపూర్ణ సమీక్ష నిర్వ#హంచారని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి 2017లో తెలంగాణ ప్రభుత్వం జీఓ 429 విడుదల చేస్తూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రూ.780 కోట్లతో చేపట్టి కేవలం పది నెలలలో పూర్తిచేసిందని ఆయన పేర్కొన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లను ప్రతిపాదించారని, ఈ రిజర్వాయర్లకు సంబంధించిన సర్వే పూర్తయిందన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్డీఎస్ కాలువ కింద సాగునీరందని 50 వేల ఎకరాలకు నీరందించడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తానన్న మాటను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నిలబెట్టుకున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. పుట్టిన నడిగడ్డను, తెలంగాణను గాలికి వదిలి ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం చేసి దోచుకుపోయిన హాంద్రీనీవా నీళ్లకు హారతిపట్టిన డీకె అరుణను పక్కనపెట్టుకుని బండి సంజయ్ ఆర్డీఎస్ ఆయకట్టు గురించి మాట్లాడడం #హస్యాస్పదమని విమర్శించారు. మొన్న వడ్లు కొంటాం ..రైతులు వరి వేయాలి .. కేంద్రంలో ఉన్నది మా ప్రభుత్వం అన్నావ్.. వరి పంట కోతకొచ్చాక మొకం చాటేశావని బండి సంజయ్‌నుద్దేశించి మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.