హైదరాబాద్, ఆంధ్రప్రభ: నవోదయ విద్యాలయ సమితి నోయిడాలోని ప్రధాన కార్యాలయంతో పాటు- దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతీయ కార్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1377 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు స్వీకరణకు గడువుంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
రాత పరీక్ష ధ్రువపత్రాలు పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును బట్టి 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.