హైదరాబాద్, ఆంధ్రప్రభ : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేబీఆర్ పార్కు దగ్గర ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలను, హోర్డింగ్‌లని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, అతని అనుచరులు చింపి వేశారని, అదే విధంగా సీఎం కేసీఆర్‌ని, కేటీఆర్‌ని అనేక రకాలుగా తిడుతూ నానా దుర్బాషలాడారని అప్పటి టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ హోదాలో ఉన్న ఇప్పటి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన అప్పటి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్స్ దలి నాయుడు, అజయ్ కుమార్‌లు ధర్మపురి అరవింద్‌పైన ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షుల విచారణ పూర్తయి ఎగ్జామినేషన్‌కి తప్పనిసరి రావాల్సి రావడంతో ఈ రోజు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి ఈ కేసులో ధర్మపురి అరవింద్‌కు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పోలీసులకు అరవింద్‌ను వెంటనే అరెస్టు చేయాలని సూచించారు. కేసును ఈనెల 28వ తేదికి వాయిదా వేశారు.