సచివాలయంలో తెలంగాణా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. ఈ భేటీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. 5జీ నెట్వర్క్ ని మరింత అభివృద్ధి చేసి పూర్తిగా అన్ని రంగాలకు అందించాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు.
విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్య అందించాలనే సంకల్పంతో క్వాడ్ జెన్ కంపెనీ వాళ్ళతో కలిసి ప్రతి పాఠశాలలో ఐడబ్ల్యూబీ (intaractive white boards) ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులకు 20వేల లోపు ల్యాప్ టాప్స్ అందించే బృహత్తరమైన కార్యక్రమం చేపడుతున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ భేటీలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టీన్, సేల్స్ హెడ్ మ్యాన్క్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్, పద్మజ, రాజేష్, సీఎస్ రావ్, తదితరులు పాల్గొన్నారు.