హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్ని కల్లో ఇద్దరు మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యే లకు పోటీ- చేసే అవకాశం ఉండకపో వచ్చన్న ప్రచారం అధికారపార్టీ భారాస లో విస్తృతంగా సాగుతోంది. ఈ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు బదులుగా అదే సామజిక వర్గానికి చెందిన మహిళలను లేదా వారి కుటు-ంబ సభ్యులను పోటీ-కి పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలు, రెండోసారి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎమ్మె ల్యేలు వారి వారి సిట్టింగ్ స్థానాల నుంచి పోటీ- చేసి విజయం సాధించారు. ఇందులో ఒకరు తొలి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్లపాటు- కీలక పదవిలో కొనసాగారని చెబుతున్నారు. భారత రాష్ట్ర సమితి తరపున 2018 ఎన్నికల్లో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు విజయం సాధించగా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (ప్రస్తుత విద్యాశాఖ మంత్రి), ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లేందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ భారాస తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. భారాస నుంచి 2018లో రెండోసారి పద్మా దేవేందర్ (మెదక్), అజ్మీరా రేఖా నాయక్ (ఖానాపూర్), గొంగిడి సునీతారెడ్డి (ఆలేరు) విజయం సాధించారు.
కాగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన భారాస చీఫ్ కేసీఆర్ ప్రతి రెండు వారాలకొకసారి అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో వారి పనితీరు, వ్యవహార శైలి, ఎన్నికల్లో తిరిగి ఎంపిక చేస్తే ఎలా ఉంటు-ంది? అనుకూల, ప్రతికూల పరిస్థితులు, విపక్ష పార్టీల బలాలు, బలహీనతలపై సర్వే నిర్వహించి అందులో వచ్చిన ఫలితాలను అధ్యయనం చేస్తూ అభ్యర్థుల వడపోత ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్టు- తెలుస్తోంది. అయితే కేసీఆర్ తన వేగుల ద్వారా తెప్పించిన సమాచారం, సర్వే నివేదికలలో వచ్చిన అంశాలను బేరీజు వేసి అభ్యర్థులు ఎవరన్నది నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని నివేదికల్లో ఇద్దరు సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత మాత్రం బాగోలేదన్న విషయం బయటపడడంతో వారిని తప్పించి ఇతరులకు లేదా ఆ ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎన్నికల్లో పోటీ- చేసే అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేసీఆర్ వచ్చారన్న ప్రచారం పార్టీలో, బయట జోరందుకుంది.
ఇందులో ఒక ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. దళిత బందు పథకంలో లబ్దిదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని వారికి రుణాలు ఇప్పించినట్టు- సదరు ఎమ్మెల్యేపై అభియోగాలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జరిపించిన విచారణలోనూ లబ్దిదారుల నుంచి రుణాలు ఇప్పించేందుకు డబ్బులు తీసుకున్న విషయం బయటపడినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటు-న్న ఎమ్మెల్యేను ప్రగతి భవన్‌కు పిలిపించి గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు- తెలుస్తోంది. మొత్తం మీద త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో గట్టిగానే వ్యవహరించాలన్న పట్టు-దలతో సీఎం కేసీఆర్ ఉన్నట్టు- తాజా పరిణామాల బట్టి తెలుస్తోంది.