ఖమ్మం జిల్లాలో మంచినీటి సమస్య కొరత లేకుండా చూడాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను కోరారు.. నేడు ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆగిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
విద్యుత్ సమస్యలు ఎక్కడ ఉండకూడదని చెప్పారు.. అలాగే, ఖమ్మంకు రింగ్ రోడ్ పై కూడా ఒక్క ప్రణాళిక రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇక ఖమ్మం జిల్లా చుట్టూ జాతీయ రహదారి వస్తున్న నేపథ్యంలో రింగు రోడ్డు నిర్మాణానికి అవసరం ఉందని దానికి అనుకూలమైన ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. ఖమ్మం నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆక్రమణలు తొలగించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అదే విధంగా ప్రైవేట్ ల్యాండ్స్ విషయంలో కూడా ఆక్రమణలు కబ్జాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నగరంలో వచ్చే వేసవి కాలంలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదే విధంగా జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లాను అన్ని విధాల అభివృద్ది చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు.