Tuesday, November 26, 2024

BRS ను ఏ శ‌క్తి ఆప‌లేదు.. మంత్రి పువ్వాడ‌

ఖమ్మం : రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని, అందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఅర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఖమ్మం నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. కేసీఅర్ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో గులాబీ నేతలు కృషి చేయలని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని మళ్ళీ గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని, మూడోసారి గెలిపించి మళ్ళీ సీఎం కేసీఆర్‌ ను ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రజక సంఘం రాష్ట్ర నాయకులు రెగళ్ళ కొండల అధ్వర్యంలో పలువురు మంత్రి పువ్వాడ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

రఘునాధపాలెం మండలం వెపకుంట్ల గ్రామం నుండి సీపీఐ ఎంఎల్ పార్టీ నుండి శీలం మల్లయ్య అధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీయేతర పాలిత రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎక్కడికక్కడ వివరించాలన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం తన స్వార్థరాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్రజలకు చెప్పాలని హితబోధ చేశారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆర్ జేసీ కృష్ణ, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, రఘునాధపాలెం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వీరు నాయక్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement