ఆదిలాబాద్: భారాస టికెట్ దక్కని తాను ఇతర పార్టీలో చేరుతాననే వదంతులను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కొట్టి పారేశారు. తాను భారాసలోనే ఉంటానని, పార్టీ గెలుపునకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. టికెట్ల కేటాయింపు అనంతరం ఆయన ఆదిలాబాద్‌లోని తన నివాసానికి చేరుకోగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయణ్ని కలిసేందుకు భారీగా తరలివచ్చారు.
తనకు టికెట్ రాలేదని పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీల వైపు చూడొద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, భవిష్యత్తులో ఎమ్మెల్యే కంటే మంచి పదవి ఇస్తారేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న వారిని కెసిఆర్ అన్యాయం చేయరని అన్నారు..