హైదరాబాద్, ఆంధ్రప్రభ: నిరుపేద క్యాన్సర్ రోగులు వైద్యం అందక ప్రాణాలు విడిచే పరిస్థితులు రాష్ట్రంలో ఉండకూడదని వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఎంఎన్‌జే, నిమ్స్ ఆసుపత్రుల్లో క్యాన్సర్ సేవలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.ఈ మేరకు ఎంఎన్‌జే క్యాన్సర్, నిమ్స్ ఆసుపత్రులపై శనివారం ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో రూ.95కోట్లతో సమకూర్చనున్న వైద్య సదుపాయాలపై చర్చించారు.
పేద రోగుల్లో ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి, అది ముదరకుండా చూడాలన్నారు. ఇందుకు జిల్లాల వారీగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎన్‌జే ఆసుపత్రిలో అదనంగా 300 పడకల అభివృద్ధికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ డా. రమేష్‌రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతామహంతి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.