Friday, January 24, 2025

MDK | తెలంగాణ పోలీసుకు స‌రిలేరెవ్వ‌రూ.. డీజీపీ జితేందర్

  • నిబద్ద‌త‌కు మారుపేరు తెలంగాణ పోలీసు
  • ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా విధులు
  • డ్ర‌గ్స్ నిర్మూల‌న‌కు చ‌ర్య‌లు
  • రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్


మెద‌క్‌, ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి : ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ పోలీసులు క్రమశిక్షణ, నిబ‌ద్ధ‌త క‌లిగిన వార‌ని, శాంతిభ‌ద్ర‌త ప‌రిర‌క్ష‌ణ‌కు నిరంత‌రం శ్ర‌మిస్తున్నార‌ని డీజీపీ జితేంద‌ర్ అన్నారు. తెలంగాణ పోలీసుల‌కు ఎవ‌రూ సాటి లేర‌న్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నారన్నారు. గురువారం డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లో కవాతు ప్రాంగణం, సెల్యూట్ బేస్ ను ఆవిష్కరించడానికి మెదక్ జిల్లాకు విచ్చేశారు. అనంతరం సెల్యూట్ బేస్ ప్రాంగణాన్ని శిలాఫలకాన్ని ఆవిష్క‌రించారు.

డ్ర‌గ్స్ నిర్మూల‌న‌కు చ‌ర్య‌లు…
డ్ర‌గ్స్ నిర్మూల‌న‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని డీజీపీ చెప్పారు. తెలంగాణ పోలీసు పటిష్టంగా ఉందని, టెక్నాలజీని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కేసును త్వరితన ఛేదించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీస్ శాఖ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెప్పారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరిగిన 100కు డయల్ చేయాలన్నారు. అర్బన్ ఏరియాలో అయితే పోలీసులు పది నిమిషాలు సంఘటన స్థలానికి చేరుకుంటారని, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 15 నిమిషాల్లో సంఘటనకు చేరుకుంటారన్నారు. పోలీస్ సేవలు ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు.

స‌రెండ‌ర్ లీవుల‌కు రూ.200 కోట్లు…
పోలీస్ సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా తాను ఉన్నట్లు డీజీపీ చెప్పారు. పోలీసులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్తానన్నారు. సరెండర్ లీవులు బిల్లుల కోసం రూ.200 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసిన‌ట్లు తెలిపారు. ఆరోగ్య భద్రతకోసం రూ. 75 కోట్లు విడుదలైనట్లు చెప్పారు. రాష్ట్రంలో 100 డయల్ సేవలందించేందుకు 2000 వాహనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement