వనపర్తి/పెద్దమందడి (ప్రభ న్యూస్) : వనపర్తికి మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలో వస్తావని ఎవరూ ఊహించని అద్భుతాలను నిజం చేసి చూపించామన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో విద్యకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేవుడు అవకాశం ఇస్తే చిన్నప్పటి నుండి మళ్లీ చదువుకోవాలన్న ఆశ ఉంది అన్నారు.గతంలో చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఉండేవి..తెలంగాణలో చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం..మెడికల్, ఫార్మసీ, నర్సింగ్ విద్యార్థులకు అన్ని రకాల శాశ్వత సౌకర్యాలు కల్పించాం..జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన ఉండాలి..మెడికల్ కళాశాల వసతిగృహాల నిర్మాణం త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం ..వనపర్తి చుట్టూ అందమైన విహారప్రదేశాలు, చెరువులు, స్వచ్చమైన గాలి, ప్రదేశాలు ఉన్నాయి .. విద్యార్థులు ప్రకృతిని ఆస్వాదించాలని చెప్పారు.వనపర్తి మెడికల్ కళాశాలలో సేవలు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.మెడికల్ విద్యార్థులను ప్రశ్నలు అడిగి నగదు బహుమతులు అందజేత చేశారు..వనపర్తి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులతో సమావేశమై, వారితో కలిసి భోజనం చేసి వసతుల్లో లోటుపాట్లు అడిగి తెలుసుకున్నారు మంత్రి.
వనపర్తికి మెడికల్, ఇంజనీరింగ్ కాలేజ్ లు వస్తాయని ఎవరూ ఊహించలేదు.. మంత్రి సింగిరెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement