Friday, November 22, 2024

Helth Minister: కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు….మాస్కులు ధరించండి..మంత్రి రాజనర్సింహ్మ

క‌రోనా పెరుగుద‌ల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించాలని వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న‌ నేప‌థ్యంలో ఇవాళ ఆయ‌న హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్య విధాన పరిషత్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే అక్కడక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కరోనా సన్నద్ధతపై వివరించిన‌ట్లు చెప్పారు. అన్ని ఆసుప‌త్రుల్లో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. పండగల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గుంపులోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. ప్రభుత్వం మాస్క్ నీ తప్పని సరి చేసినా చెయ్యక పోయినా ప్రతి ఒక్కరూ గుంపుల్లోకి వెళితే మాస్క్ ని బాధ్యతగా ధరించాలని సూచించారు. ఓమిక్రన్ వేరియంట్ కి సబ్ వేరియంట్ జెఎన్‌.1 కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని, వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటుందంటూ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మెడికల్ అండ్ హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా చౌంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆర్వీ కణ్ణన్, వైద్య విధాన పరిషత్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement