Monday, November 25, 2024

NZB: ఏ కష్టం వచ్చినా.. దివ్యాంగులకు అండగా ఉంటా.. ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 19 (ప్రభ న్యూస్) : దివ్యాంగులను చిన్నచూపు చూడొద్దని… వారికీ కావలసిన మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం పై ప్రతేక్ష దృష్టి పెట్టాలని.. దివ్యాంగులకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఖలిల్ వాడిలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మహిళా శిశు దివ్యంగుల, వయో వృదుల సంక్షేమ శాఖ, సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, రాష్ట్ర ఊమెన్ కమిషన్ సభ్యులు సుధం లక్ష్మి, నగర మేయర్ నీతు కిరణ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ… దివ్యాంగులకు శారీరక లోపం ఉన్నప్పటికీ అన్నిరంగాల్లో ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. దివ్యాంగుల కోసం సదరం సర్టిఫికెట్ లను ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడారు.. దివ్యాగులకు భగవంతుడు అంగవైక్యలం ఇచ్చిన కానీ.. మానసికంగా మీరు చాలా ఉత్సహవంతులన్నారు. ప్రపంచంలో అనేక మంది మేధావులు దివ్యాంగులే అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో నుంచి వచ్చే నిధులతో వికలాంగులకు ఏ అవసరం ఉన్నా అండగా ఉండాలని అధికారులను కోరారు. దివ్యాంగులకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే తన ట్రస్ట్ దన్ పాల్ లక్ష్మి భాయ్ విట్టల్ గుప్తా చారిట్రబుల్ ట్రస్ట్ నుంచి కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

మీరు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థానంలో ఉండాలని మనసారా కోరారు. అదేవిధంగా సదరం సరిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతున్నటు తన దృష్టికి కూడా వచ్చిందన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ను కోరుతున్నా.. వారికీ సంబంధించి డాక్టర్ ని కూడా వెంటనే ఆపాయింట్ చేసి వారికీ ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి.. తాను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమాధికారి రసూల్ బి, స్నేహ సొసైటి సిద్దయ్య, దివ్యాంగులు అధికా సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement