హైదరాబాద్, ప్రభన్యూస్: కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, వాటిని ఎదిరించి విజయాలు అందిపుచ్చు కోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వివిధ శాస్త్రాల, విజ్ఞానాల కూడలి అని కితాబిచ్చారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలయే కోఠి ఉమెన్స్ కాలేజీని, వారి బతుకులను తీర్చిదిద్దే కలల పంట అని మంత్రి పేర్కొన్నారు.
ఒక మహిళ చదువుకుంటే కుటుంబమంతా చదువుకున్నట్లేనని ఆమె తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి వివరించారు. అమ్మాయిలు శారీరకంగా మాత్రమే కొంచెం బలహీనులని, కానీ వారిలో పట్టు దల, నిజాయితీ, తెగింపు అనితర సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ, కళాశాల ప్రిన్స్ పాల్, వైస్ ప్రిన్స్ పాల్, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily
ఇది కూడా చదవండి: