Friday, November 22, 2024

ఎంసెట్ లో ఇంటర్‌ వెయిటేజ్ లేన‌ట్లేనా…?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌పై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. వెయిటేజీ ఉండాలా? లేదా? అనే దానిపై ఇంత వరకూ నిర్ణయం తీసుకొలేదు. ఎంసెట్‌ను మే నెలలో నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించింది. అయినా ఇంతవరకూ డిటైల్డ్‌ నోటిఫికేషన్‌ మాత్రం ప్రకటిం చకపోవడంతో అభ్యర్థుల్లో దీనిపై స్పష్టత కరువైంది. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంసెట్‌లో వెయిటేజీ ఇవ్వాలా? లేకపోతే మొత్తానికే ఎత్తివేయాలా? అనే దానిపై ప్ర భుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. లేకపోతే ఈ ఏడాదికి వెయిటేజీ ఇవ్వకుండా వచ్చే ఏడాది నుంచి యథావిధిగా అమలు చేయాలా? కనీస మార్కులు వచ్చి ఉండాలన్న నిబంధనలను సడలించాలా? లేదా? అనే పలు అంశాలపైన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపైన ప్ర భుత్వానికి అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈక్రమం లోనే ఈనెల 24న జేఎన్టీయూ ఎంసెట్‌ నిర్వహణపై సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రకటించిన ఎంసెట్‌ షెడ్యూల్‌ ప్రకారం మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ విద్యార్థులకు, మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకునే తుదినిర్ణయం మేరకు ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లపై జేఎన్‌టీయూ తలమునకలైంది. వెయిటేజీపైన ప్ర భుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే దానికనుగుణంగా నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. ప్రతి ఏడాది 2.7 లక్షల మంది వరకు విద్యార్థులు ఎంసెట్‌ పరీక్షకు హాజరవుతుం టారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి జరగ నున్నాయి. అయితే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు రానున్నాయి. సెకండ్‌ ఇయర్‌ విద్యా ర్థులకు మాత్రం 100శాతం సిలబస్‌ ఉంటుందని అధికారులు ఇప్పటికే ప్రకటించిన క్రమంలో ఈసారి ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ ఉండబోదని తెలుస్తోంది. అధికారిక వర్గాలు కూడా దీన్నే స్పష్టం చేస్తున్నాయి. వివిధ సాంప్ర దాయ, వృత్తి విద్యాకోర్సులు చదివేందుకు రాష్ట్రంలో ఎంసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, ఈసెట్‌, లాసెట్‌, సీపీగెట్‌ తదితర ప్రవేశ పరీక్షలను ప్రతి ఏటా మే, జూన్‌, జులై నెల్లలో నిర్వహి స్తుంటారు. అయితే ఎంసెట్‌ మినహా ఏ ఒక్క ప్రవేశ పరీక్షకు వెయిటేజీ మార్కులు లేవు. ఈ క్రమంలో దీనిపై బిన్నాభిప్రా యాలు విద్యా వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల్లో ఎంసెట్‌ డిటైల్డ్‌ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్లు విద్యా శాఖ వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement