Sunday, November 17, 2024

సుతి లేని బిజెపి.. మతి లేని కాంగ్రెస్.! – హ‌రీష్ రావు..

సిద్దిపేట – ధరణి పోర్టల్ విషయంలో బీజేపీ వైఖ‌రిని మంత్రి హ‌రీశ్ రావు ఖండించారు. ఆ పార్టీది పూటకో మాట, నోటికో మాట అన్న ఉంద‌న్నారు. ఇవాళ ట్విట్ట‌ర్‌లో మంత్రి హ‌రీశ్ స్పందిస్తూ.. గల్లీ బీజేపీ నాయకులు ఒకటి చెప్తే, ఢిల్లీ నాయకులు ఇంకొకటి చెప్తున్నార‌ని విమ‌ర్శించారు. ధరణిని రద్దు చేయబోమని మొన్న రాష్ట్ర నాయకులు అంటే, రద్దు చేస్తామని నిన్న నడ్డా అన్నట్లు మంత్రి హ‌రీశ్ పేర్కొన్నారు. బీజేపీ రెండు నాలుకల ధోరణికి ఇది మరొక నిదర్శనమ‌న్నారు. బీజేపీ పార్టీలో నేతల మధ్య సుతి కలవదు, ఒకరి మాట మరొకరు వినరు అని హ‌రీశ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ధరణి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, గుడ్డిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నాట్లు మంత్రి తెలిపారు.

రైతుబంధు పండుగ ప్రారంభం – రైతుల మోముల‌ల‌లో ఆనంద‌నం

రాష్ట్రంలో నేటి నుంచి మ‌ళ్లీ రైతు బంధు పండుగ మొద‌లైన‌ట్లు మంత్రి హ‌రీశ్ రావు చెప్పారు. ఈ మేరకు ఇవాళ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. రైతు బంధు స్కీమ్ కింద తెలంగాణ రైతులకు పెట్టుబ‌డిగా ఇస్తున్న మ‌ద్ద‌తు ల‌క్ష‌లాది మంది రైతుల‌కు నేటి నుంచి ప్రారంభం అవుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప‌ద‌కొండ‌వ విడుత రైతు బంధు ప్రారంభ‌మైన సంద‌ర్భంగా ఆయ‌న ట్వీట్ చేశారు. రైతుల అభివృద్ధి, శ్రేయ‌స్సే సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని, ఇవాళ తొలి రోజు సంద‌ర్భంగా 645.52 కోట్ల నిధుల‌ను రైతుల ఖాతాల్లోకి క్రెడిట్ చేస్తున్న‌ట్లు మంత్రి హ‌రీశ్ వెల్ల‌డించారు. జూన్ 26వ తేదీ రోజున సుమారు 22,55,081 మంది రైత‌లుకు రైతు బంధు అందిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement