హైదరాబాద్ – మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయనే వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి కెసిఆర్ క్లారిటీ ఇచ్చారు.. శాసనసభ సమావేశాల చివరి రోజైన అదివారం నాడు వివిధ అంశాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ, ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మేర ఉందని అన్నారు… రహేజా ఐటీ పార్క్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నదని చెప్పారు. . తర్వలో లక్డీకాపూల్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు మెట్రో మూడో దశ ప్రాజెక్ట్ చేపడతామని వెల్లడించారు.. పాతబస్తీ మెట్రోకు ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కేటాయించామని, అంటూ త్వరలోనే పాతబస్తీ ప్రజలకు సైతం మెట్రో అందుబాటులోకి రానుందని తెలిపారు.. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు చేశారు. క ముంబై, తమిళనాడు, గుజరాత్ మెట్రోలకు కేంద్రం నిధులు ఇచ్చిందని,. హైదరాబాద్ మెట్రోకు పైసా కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు… మెట్రో ఛార్జీల పెంపు ఉండదని, ఆర్టీసీ తరహాలోనే ఛార్జీలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.