Wednesday, November 20, 2024

KTR | పవర్ చార్జీల పెంపు వద్దు… విద్యుత్‌ నియంత్రణ మండలికి వినతి

ఛార్జీలు పెంచాలనే ఆలోచన దుర్మార్గం
డిస్కంల ప్రతిపాదనలు వాస్తవానికి విరుద్దం
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
విద్యుత్ నియంత్రణ మండ‌లికి కెటిఆర్ విన‌తి
అయిదు రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంపు అస‌మంజ‌సం
పెద్ద‌, చిన్న‌, మ‌ద్య క్యాట‌గీరిలో ఒకే గాట క‌ట్ట‌డం ఏంటీ
ఉచిత విద్యుత్ మంగ‌ళం కోస‌మే ఈ పెంపు
ఈసారి ఏకంగా ప్ర‌జ‌ల‌పై రూ 18 వేల కోట్లు పెంపు
పార్టీ ప‌రంగా ఈ పెంపును అడ్డుకుంటాం..
అవ‌స‌ర‌మైతే ఉద్య‌మానికి సిద్ధం
మా ప్ర‌భుత్వంలో విద్యుత్ రంగం స్వ‌ర్ణ‌యుగ‌మే
ప‌దేళ్ల‌లో ఒక్క పైసా పెంచ‌ని ఘ‌న‌త మాదే
రేవంత్ 10 నెల‌ల్లోనే 18 వేల కోట్లు పెంచేస్తున్నారు.

సిరిసిల్లా ఆంధ్ర‌ప్ర‌భ : విద్యుత్‌ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపు, ఆదాయ ఆవశ్యకతపై సిరిసిల్లలో తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి నేడు బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ తమ వాదన వినిపిస్తూ ప్రజలపై కరెంటు భారం మోపడం సరికాదన్నారు.

విద్యుత్‌ చార్జీలను 5 రెట్లు పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అన్నిరకాల పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్‌ను ఒకే గాటున కట్టడం కరికాదని చెప్పారు. చార్జీల పెంపుతో కుటీర పరిశ్రమలపై భారం పడుతుందన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. అన్ని ఇండస్ట్రీలను కాపాడుకుంటేనే మనుగడ ఉంటుందని చెప్పారు. ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమల పై వెయ్యాలని ఆలోచించడం సమంజసం కాదని చెప్పారు. బాధ్యతగల ఈఆర్‌సీ ఈ విషయంలో ప్రజలు, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు.

తెలంగాణలో సహకార విద్యుత్ సంస్థ ఒకే ఒక్కటి మన సిరిసిల్ల జిల్లాలో ఉంద‌ని అంటూ డిస్కంలతో పోలిస్తే మా సెస్ ఎంతో బెటర్ అని అన్నారు. . కాబట్టి సెస్‌ను కాపాడాలని విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లిని అభ్య‌ర్ధించారు. సెస్‌లో డిమాండ్‌కు తగ్గట్టు ఏడు హెచ్‌పీ మోటార్ల వరకు సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాన‌ని చెప్పారు.. సెస్ కోసం వచ్చే సబ్సిడీ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాల‌ని కోరారు. ,అలాగే రైతులే నడిపించే సంస్థ సెస్ అని అంటూ , ప‌నులు లేక ఈ పది నెలల్లోనే పదిమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమ‌ని అన్నారు.

కరెంటు చార్జీలు పెంచాలి అనే ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలన్నారు. ఉచిత విద్యుత్‌ పేరుతో ఉన్న విద్యుత్‌ను ఊడగొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పేరుతో ప్ర‌జ‌ల‌పై మ‌రో 12వేల కోట్ల భారం మోపేందుకే ఈ చార్జీల‌ను పెంచుతున్నార‌ని వివ‌రించారు. విద్యుత్‌ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పది నెలల్లో ఒక వైపు కరెంటు కోతలు.. మరోవైపు చార్జీల మోతలని విమర్శించారు. చార్జీల పెంపును అడ్డుకుంటామని, ప్రజా పోరాటానికి వెనుకాడమన్నారు.

- Advertisement -

మా హ‌యాంలో స్వ‌ర్ణ‌యుగం ..
విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి లో త‌న వాద‌న వినిపించిన అనంత‌రం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ పాలన విద్యుత్ రంగానికి స్వర్ణయుగమని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అసంబద్ధమైన విద్యుత్ ఛార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందనా కేటీఆర్‌ తెలిపారు. అలాగే, ఇప్పుడు పెంచుతున్న విద్యుత్ ధరలను బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

‘2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో పారిశ్రామికవేత్తలు పవర్ హాలీడే వద్దని రోడ్డెక్కారు. నేతన్నలు పవర్ లేక ఇబ్బంది పడ్డారు. ఇవాళ మళ్లీ పది నెలల నుంచి కోతలు మొదలయ్యాయి. ఇప్పుడు పెంచుతున్న విద్యుత్ ధరలను మేం వ్యతిరేకిస్తున్నాం. మధ్యతరగతి నడ్డి విరిచే నిర్ణయం ఇది. ఈ ఆర్థిక సంవత్సరం కోసం వివిధ విద్యుత్ సంస్థలు 18 వందల కోట్ల రాబడి కోసం చేసిన ప్రతిపాదనను తాము ఖండిస్తున్నామ‌ని అన్నారు.

మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల విద్యుత్ భారాన్ని నాడు ప్రభుత్వం భరించిందే తప్ప ప్రజలపై భారం వేయలేద‌న్నారు. ఇళ్లకు 300 యూనిట్లు దాటితే 50 రూపాయలు యూనిట్‌కు పెంచడం దుర్మార్గ‌మ‌న్నారు. 300 యూనిట్లు 70 శాతం ప్రజలు దాటడం ఖాయమ‌ని అంటూ ఈ అసంబద్ధమైన విద్యుత్ ఛార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని కెటిఆర్ చెప్పారు. చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలన్నింటినీ ఒకే మాదిరిగా లెక్క కట్టడం సరికాద‌న్నారు. అదానీ, అంబానీలకు.. సిరిసిల్ల నేతన్నలకు ఒకే కేటగిరి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత పదేండ్లలో ఆత్మహత్యలు లేవు, కానీ 10 నెల్లలోనే 10 మంది చనిపోయారన్నారు. సీఎం రేవంత్‌ బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. పెంపు వ‌ల్ల కుటీర పరిశ్రమలు ఇంకా కుంటుపడే అవకాశం ఉంద‌ని వివరించారు.. రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తూ పదేళ్ల పాలనలో రూపాయి ఛార్జీలు పెంచలేద‌ని అన్న కెటిఆర్ , ఈ ప్రభుత్వం పది నెలల్లోనే 18 వేల కోట్ల అదనపు భారాన్ని ఎందుకు మోపుతున్నారో ఈ సర్కారు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

పొంగులేటి సార్.. ముందు ఈడీ రైడ్ గురించి చెప్పండి..

దీపావళికి ముందే బాంబులు పెళుతాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చేసిన వ్యాఖ్యల‌పై కెటిఆర్ స్పందిస్తూ,
బాంబులు అంటే పొంగులేటి ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ల గురించి చెబుతారేమో బహుశా?. అని అన్నారు.. త‌మ మీద కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండ‌ని తేల్చి చెప్పారు.. . చిట్టినాయుడు బెదిరింపులకి మేము భయపడబోమ‌ని, అంటూ . ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేద‌ని అన్నారు. తాము మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని, అప్పుడు. ఒక్కొక్కడి సంగతి తెలుస్తామ‌ని హెచ్చ‌రించారు.

గాడిద‌లు కాయ‌డానేకేనా…సంజ‌య్..

జగిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ గాడిదలు కాయడానికి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకున్నారా అని ప్ర‌శ్నించారు కెటిఆర్ ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ వ్యభిచా అని అంటూ .అత‌డితో రాజకీయ వ్యభిచారం రేవంత్ రెడ్డి చేస్తున్నార‌ని కాస్త ప‌రుషంగా మాట్లాడారు… కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులనే చంపుకుంటున్నార‌ని అన్నారు.

.ఈ కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌ రావు, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, న్యాలకొండ అరుణ, జిందం కళా చక్రపాణి, సుంకే రవిశంకర్‌, తులా ఉమలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement