Sunday, November 24, 2024

వెలవెలబోతున్న రిజర్వాయర్లు.. నైరుతి విస్తరించినా క‌నిపించ‌ని వ‌ర‌ద‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినా, వారం, పది రోజులుగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు మాత్రం వరద లేక వెలవెలబోతున్నాయి. కృష్ణా ఎగువన కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద వచ్చి చేరడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క జూరాల ప్రాజెక్టును మినహాయిస్తే శ్రీశైలం, సాగర్‌లు వరద కళ లేక వెలవెలబోతున్నాయి. జూరాల ప్రాజెక్టులకు 227 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా… శ్రీశైలం ప్రాజెక్టుకు కేవలం 61 టీఎంసీల వరద మాత్రమే వస్తోంది. ఇక నాగార్జునసాగర్‌కు ఒక్క క్యూసెక్కు వరద కూడా రికార్డు కాకపోవడం గమనార్హం. కర్ణాటకలోని నారాయణపూర్‌కు 5717 క్యూసెక్కుల వరద ప్రతి రోజూ వచ్చి చేరుతుండగా… తుంగ భద్రకు 2566 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రస్తుతం నారాయణపూర్‌లో 37.64 టీఎంసీల సామర్థ్యానికి గాను 36.68 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 100 టీఎంసీలు కాగా… ప్రస్తుతం జలాశయంలో 40,91 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అలమట్టిలో 129.72 టీఎం సీలకుగాను 50.06 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. ఈ లెక్కన ఎగువన కర్ణాటకలోని అలమట్టి, నారాయణపూర్‌, ఉజ్జయినీ, తుంగభద్ర ప్రాజెక్టులు నిండితేనే గాని శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు గోదావరి పరి వాహక ప్రాంతంలోని నిజాంసాగర్‌కు కూడా వరద నమోదు కాలేదు. శ్రీరాం సాగర్‌కు 2604 క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్‌ పూర్తిసామర్థ్యం 90.31టీఎంసీలు కాగా… ప్రస్తుతం 20.22 టీఎంసీల నీరు రిజర్వాయర్‌లో ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement