Saturday, November 23, 2024

Delhi: ఆ మెడికోల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. టీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి విద్యాభ్యాసాన్ని మధ్యలోనే వదిలేసి వచ్చిన భారతీయ వైద్యవిద్యార్థులకు దేశంలోని మెడికల్ కాలేజీలలో ప్రవేశం కల్పించాలన్న అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెంకటేశ్‌ నేత, రంజిత్‌రెడ్డి, మాలోత్‌ కవిత, పసునూరి దయాకర్‌లు శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భరతి ప్రవీణ్ పవార్ బదులిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఉక్రెయిన్ బాధిత భారతీయ వైద్య విద్యార్థులకు స్థానిక మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల అంశానికి సంబంధించి  వైద్య విద్య నియంత్రణ సంస్థ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసి) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ 1956, నేషనల్‌ మెడికల్‌ కమీషన్‌ యాక్ట్‌ –2019 నిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి భారతీయ వైద్య కళాశాలలకు వైద్య విద్యార్థులను వసతి కల్పించడానికి లేదా బదిలీ చేయడానికి ఆస్కారం లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అందువల్ల, ఏదైనా భారతీయ వైద్య సంస్థలో విదేశీ వైద్య విద్యార్థులను బదిలీ చేయడానికి లేదా అడ్మిషన్‌ కల్పించడానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఎటువంటి అనుమతి ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement