Tuesday, November 26, 2024

Delhi: క‌విత‌కు నో బెయిల్ …

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కవిత బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించిన రౌస్‌ అవెన్యూ కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ తుది తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం కవిత తిహార్ జైలులో జుడిషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

తాను బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌నని.. అందుకే తాను ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత కోర్టుకు వివరించారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని తెలిపారు. ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని కవిత న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్టుకు సరైన కారణాలు లేవని న్యాయస్థానానికి చెప్పారు. అయితే మరోవైపు సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని తెలిపారు. మద్యం కేసులో కవితే కీలక సూత్రధారి, పాత్రధారి అని మరోసారి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement