Wednesday, January 15, 2025

Nizamabad – పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

నిజామాబాద్ ప్రతినిధి జనవరి14: (ఆంధ్రప్రభ ) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నేడు అట్ట హసంగా నిర్వహించారు. ఢిల్లీ లో వాణిజ్యం పరిశ్రమల మంత్రి, పీయూష్ గోయల్ ,డైరెక్టర్ (రెస్. & ఫిన్.), స్పైసెస్ బోర్డ్,డాక్టర్ ఎ.బి. రెమా శ్రీ , హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి, బండి సంజయ్ కుమార్, పార్ల మెంట్ సభ్యు లు, అరవింద్ ధర్మపురి లు పసుపు బోర్డు ను వర్చు వల్ లో ప్రారంభిం చారు.

అనంతరం పసుపు బోర్డు ఏర్పాటు కలను చేసినందుకు మంత్రి, పీయూష్ కు పసుపు కొమ్మల తో దండను వేసి ఎంపీ అరవింద్ సత్కరించారు.

ప్రధాని మోదీ కి పాదాభివందనం..ఎంపీ ధర్మపురి

ఈ సందర్భంగా లక్షలాది మంది రైతుల పసుపు బోర్డు కల నెరవేర్చి నందుకు ప్రధాని మోడీకి ఎంపీ ధర్మపురి పాదాభివందనం తెలిపారు. సంక్రాంతి పండుగకు కానుకగా పసుపు బోర్డు ను అం దజేసిన ప్రధాని కి ధన్యవాదాలు తెలిపారు.ఈ రోజు రైతుల పండుగ అని అన్నారు. ఇచ్చిన మాట నిల బెట్టుకున్నామని అన్నారు. రైతుల సంక్షేమానికి ఎల్ల పుడూ బిజెపి కృషి చేస్తుం దన్నారు..

- Advertisement -

రైతుల కల నెరవేర్చారు.. పసుపు రైతులు

రైతుల కలను సాకారం చేసి నందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ కి పసుపు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలి పారు. పసుపు బోర్డు తీసుకు రావడంలో కేంద్ర మంత్రులతో పలుమార్లు చర్చించి విన్న వించి ప్రత్యేక కృషిచేసిన కు రుణపడి ఉంటామని రైతు సందర్భంగా తెలిపారు.

ఇక జిల్లా కేంద్రం లోని నిర్వహించిన వర్చువల్ ప్రారం భోత్సవ కార్యక్ర.మంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగా రెడ్డి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్య నారాయణ, పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ పటే ల్ కులాచారి, స్పైసెస్ బోర్డు సెక్రటరీ పి. హేమలత, మిని స్టర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ జాయింట్ సెక్రెటరీకేసాంగ్ యాంగ్జోమ్ షెర్పా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement