నిజాంపేట్ కార్పొరేషన్ లో ఎసిబి దాడులు
రెడ్ హ్యాండెడ్గా చిక్కిన టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ రావ్
మధ్యవర్తి ద్వారా రూ.1.50 లక్షలు స్వీకరణ
కేసు నమోదు చేసిన ఎసిబి
కుత్బుల్లాపూర్, మార్చి 18( ప్రభ న్యూస్): నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఏసిబి దాడులు కొనసాగుతున్నాయి. ఎసిబి దాడుల్లో కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటి ప్లానర్ శ్రీనివాస్ రావ్, సిబ్బంది తో పాటు మధ్యవర్తి ఏసీబీ అది కారులకు చిక్కినట్లు పక్కా సమాచారం. .ఓ అక్రమ నిర్మాణ విషయంలో ఏసీపీ శ్రీనివాస్ రావుకు మధ్యవర్తిత్వం వహించిన ఎ శ్రీరాముల నుంచి 1.50 లక్షలు లంచం తీసుకుంటుడగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు….. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసిన అధికారులు వారిని ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు..