నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : వైదిక సంస్కృతి లో నదులను ఆరాధించడం మన అదృష్టమని, నదులను, వనాలను తల్లిగా భావించి ఆరాధించడం నాగరికతను మించి ఎదిగిన గొప్ప సంస్కారమని గోదావరి హారతి ఉత్సవ కమిటీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎల్. వీరగోపాల్ అన్నారు. జూన్ 3 నుంచి 8 వరకు కొనసాగే గోదావరి హారతి యాత్ర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యలై విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని ఓ హోటల్ లో గోదావరి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గోదావరి హారతి యా త్రపై నిర్వహించిన ఇందూరు జిల్లా సమావేశానికి బాసర వైశ్య సత్రం ట్రస్టు చైర్మన్, నిఖిల్ సాయి హోటల్ యజమాని మూఢ నాగభూషణం గుప్తా, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ త్రివేణి, గోదావరి ఉత్సవ కమిటీ జిల్లా అధ్య క్షుడు రచ్చ తిరుపతిలు ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడారు. జూన్ 3 నుంచి జూన్ 8 వరకు తల్లి గోదావరి పిలుస్తుంది రా.. కదలి రా.. అనే కార్యక్రమాన్ని కందకుర్తిలో జూన్ 3న ప్రారంభిస్తామని ఈ యాత్ర బాసర, గొమ్మిర్యాల, ధర్మపురి, కాళేశ్వరం, రామన్న గూడెం, భద్రా చలం లో జూన్ 8న ముగిస్తామని పేర్కొన్నారు.
గోదావరి యాత్ర జూన్ 3 శని వారం త్రివేణి సంగమ క్షేత్రమైన కందకుర్తిలో ప్రారంభమవు తుందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నిర్మాణ నిర్మాత డాక్టర్ కేశవరావు బలిరాం హెగ్డే వార్ పూర్వీకులు పవిత్ర గోదా వరి తీరాన ఉన్న కందకుర్తిలో వేంచేసి ఉన్న శ్రీరామచంద్రుని అర్చకులు ఈ యాత్ర ప్రారంభిం చనున్నారని తెలిపారు. యాత్ర లోని కార్యక్రమాలు ప్రతి క్షేత్రం లో జనసభ సదస్సులు పెద్దల మార్గదర్శనం.. గోదావరి తీరాన ప్రతి సాయంత్రం సామూహిక హారతి ఉంటుందని అన్నారు ఈ యాత్రలో వేలాది భక్తులు పాల్గొననున్నారని, ఈ పుణ్య గోదావరి నది తీరాన జరిగే యాత్రలో పాల్గొని హారతులు ఇచ్చి పరవశించి ధన్యులం అవుదామని కోరారు.రాష్ట్రంలో ఐదు జిల్లాల గుండా ప్రవహి స్తున్న గోదావరి నది జలవన రులను కలుషితం కాకుండా చేపట్టవలసిన చర్యలను గుర్తిచాలన్నారు. ప్రధాన కార్యదర్శి ఎల్. వీరగోపాల్..మాట్లాడుతూ.. మన జిల్లాలో మొట్ట మొదటి సారి త్రివేణి సంగమం లో హారతి కార్యక్రమంలో పాల్గొ నడం పూర్వజన్మ సుకృతం అన్నారు. గోదావరి హారతి తరతరాల వరకు కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. రాబోవు కార్యక్రమాలు 750 కిలో మీటర్లు యాత్ర చేయడం జరుగుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా వాసులం అదృష్టవంతులని అందరు పాల్గొని ధన్యులవ్వాలని కోరారు. గోదావరి నదిని కాపా డుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని, ప్లాస్టిక్ నుంచి మురికి నుంచి గోదావరిని శుభ్రపరుచు కోవాలని అన్నారు. అనంతరం హారతి కార్యక్రమాని కి సంబంధించి కర పత్రాలను, వాల పోస్టర్ లను ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ దేవ గౌడ్, డాక్టర్ కొండ ఆశన్న, సుబ్బారావు, స్వాగత్ సమితి చైర్మన్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రామారావు, గుమ్మిర్యాల్ సర్పంచ్ రాజారెడ్డి, నీల సర్పంచ్ రాఘ వేందర్, ఉప సర్పంచ్ నాగ భూషణం, రాజ్ కుమార్ శుభే దార్, లక్ష్మారెడ్డి, పంచ రెడ్డి రాము, ఇందల్ వాయి కిషన్, కందకుర్తి, నీల, బొర్గం, సాటపూర్ గ్రామాలకార్య నిర్వహకులు పాల్గొన్నారు.