Friday, November 22, 2024

NZB: బోధన్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల నిరసన

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కేంద్రం ఆర్టీసీ డిపో ఎదుట శనివారం ఉదయం కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో కొన్నేళ్లుగా కాలం వెళ్లబుచ్చుతున్నామని తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికుల డిమాండ్ తో ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఆర్థిక అంశాలు అడ్డుపెట్టి బిల్లును ప్రవేశ పెట్టడంలో గవర్నర్ ఆలస్యం చేయడంపై కార్మికులు విధులను బహిష్కరించి డిపో ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో సైతం తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తీరాలని కార్మిక నాయకుల డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియలో ఏమాత్రం ఇబ్బందులు ఎదురైనా తామెంతకైనా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక నాయకులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement