నిజామాబాద్ ప్రతినిధి, మార్చి 12(ప్రభ న్యూస్): మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ మొదటి అదనపు మేజిస్ట్రేట్ ఖుష్బూ ఉపాద్యాయా అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా పోలీస్ సిబ్బందితో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు మేజిస్ట్రేట్ ఖుష్బూ ఉపాద్యాయా, పోలీస్ కమీష నర్ కల్మేశ్వర్ సింగినవార్, ప్రొబె షనరీ ఐ.పి.ఎస్, బి.చైతన్య రెడ్డి , డా.కిరణ్మయి, ఐ.ఎ.ఎస్ (ట్రెయినీ) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా అతిథుల చేతులమీదుగా జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు బహుమతుల ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మొదటి అదనపు మేజిస్ట్రేటు మాట్లాడుతూ… మహిళలు మనోధైర్యాన్ని కోల్పోకుండా అన్ని రంగాలలో ముందుండాలని, ప్రతీ మహిళకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అట్టి లక్ష్యసాధనకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలని అన్నారు. అనంతరం పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగినవార్ మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా స్వేచ్ఛగా జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ప్రొబెషనరీ ఐ.పి.ఎస్, బి.చైతన్య రెడ్డి, డా.కిరణ్మయి, ఐ.ఎ.ఎస్(ట్రెయినీ), తేజిత (మున్సిపల్ కమీషనర్ మేడం), ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్.ఐ అంజ మ్మ. ఎస్.ఐ పద్మ. ఎస్.ఐ కుమారి ప్రవళిక, ఆర్.ఎస్.ఐ స్రవంతి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, పోలీస్ కార్యాలయం సిబ్బంది. హోమ్ గార్డ్సు సిబ్బంది కళా బృందం పాల్గొన్నారు.