నిజామాబాద్, (ప్రభన్యూస్) : నీటిపారుదల శాఖ అధికారులతో గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎస్సారెస్పీ అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమాన్ని, ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద వచ్చే సమయంలో ఎగువ, దిగువన ఉన్న గోదావరి తీర ప్రాంతాల పరిస్థితిపై సమీక్షించారు.
ప్రాజెక్ట నీటివినియోగంలో ఉన్న సాంకేతిక, ఇతర సమస్యలను అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో వారు నివేదికను తయారు చేస్తామన్నారు. కాలువలతో అనుసంధానంగా ఉన్న ఎత్తి పోతల పథకాల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. సింగూరు, నిజాంసాగర్, అలీసాగర్, ఎస్సారెస్పీ, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుపైకి వెళ్లి వరద గేట్లను కాకతీయ, సరస్వతీ, వరద, లక్ష్మీ కాలువలను పరిశీలించారు. ఆయన వెంట వైస్ చైర్మన్ కుటియాల్ ఎస్సారెస్పీ, నిజమాబాద్ చీఫ్ ఇంజినీర్లు సుధాకర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, ఎస్‌ఈ జి.శ్రీనివాస్, ఈఈలు సి.పద్మిని, చక్రపాణి, కరుణాకర్, శంకర్, డీఈ నరేశ్, గణేవ్, ఏఈఈ అక్తర్, మాధవి, సారిక, వంశీ, రవి, రామారావు తదితరులున్నారు
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily