Saturday, September 21, 2024

NZB: రైతులందరికీ రుణమాఫీ చేస్తాం.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో : రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు సంఘాలకు, రైతు నాయకులకు విజ్ఞప్తి రైతు సమస్యలు పరిష్కరించడానికి తాము ఉన్నామన్నారు. ఆందోళనలు విరమించండి.. మీ వద్దకు గ్రామాల నుండి వచ్చిన సమస్యలను తమకు కానీ, కలెక్టర్ కు కానీ తెలపాలన్నారు. అధికారులతో కలిసి రైతుల సమస్యలు పరిష్కరిద్ధామన్నారు.

రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాధాన్యత లేదన్నారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే ప్రతి మండలానికి నోడల్ అధికారిని నియమించడం జరిగిందన్నారు. నోడల్ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు మీ సమస్యల పరిష్కారానికి మీ వద్దకు వస్తారన్నారు. పది సంవత్సరాలు మోసం చేసిన పార్టీలను నమ్మకండి.. పరేషాన్ కావాల్సిన అవసరం లేదు.. 31వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఆందోళనలు అవసరం లేదు.. ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుందన్నారు. సాంకేతిక కారణాల ద్వారా రైతుల ఇబ్బంది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, పరిష్కరించి రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంక్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.. అర్హులైన రైతుల వివరాలు ప్రభుత్వానికి పంపించండన్నారు. నేటి నుండి వారం రోజుల పాటు మీ గ్రామాలకు రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు వస్తున్నారు.. రుణమాఫీ కాని వారి వివరాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ అధికారులు మీ గ్రామంలోని గ్రామపంచాయితీకి, రైతు వేదికలకు వస్తున్నారన్నారు. ఆందోళనకు దిగాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -

గత ప్రభుత్వం (బీఆర్ఎస్) రైతాంగాన్ని మోసం చేసి రుణమాఫీ విషయంలో మాట తప్పిందన్నారు. కానీ ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ చేయడానికి సిద్ధంగా వున్న కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హులైన అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హ్యాందాన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement