Friday, November 22, 2024

NZB: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం.. ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిజామాబాద్ రూరల్, మార్చి 2 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గృహ జ్యోతి పథకాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు కరెంట్ జీరో బిల్లును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… 200 యూనిట్లు ఉచిత కరెంట్ అసాధ్యమని బీజేపీ, భారాస నాయకులు అన్నారు.. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కా అమలు చేస్తామని వెల్లడించారు.

ప్రతి గ్యారెంటీని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి తప్ప.. ఎవరికీ లబ్ధి చేరలేదన్నారు. నల్గొండ సభలో కేసీఆర్ మేడిగడ్డ బొందల గడ్డ అక్కడ ఏముంది అన్నాడు.. మరి కేటీఆర్ ఎందుకు వెళ్ళాడు బొందలు చూడడానికా అని ప్రశ్నించారు.. గ్యాస్ సిలిండర్ ఎంత ధర ఉన్నా 500 రూపాయల రాయితీ ఇస్తామన్నారు. మిగతా డబ్బులను 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామన్నారు. 2లక్షల రుణమాఫీ, రైతు భరోసా త్వరలో అమలు చేస్థామన్నారు. పంట పండించే రైతుకు, కౌలు రైతులకే రైతు భరోసా తప్ప రోడ్లకు, గుట్టలకు చెరువులకు ఇవ్వమని తెలిపారు.. బీజేపీ 10సంవత్సరాల్లో చేసింది ఏమి లేదు.. హిందూ ధర్మం అంటూ ఓట్ల వ్యాపారం చేశారు.. ఎంపీ అర్వింద్ అనుభవిస్తున్న ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదే, ముందు పసుపు బోర్డ్ ఎక్కడ ఉందో చూపించాలన్నారు. బీజేపీ, భారాస ఒక్కటే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement