ఎల్లారెడ్డి, (ప్రభ న్యూస్): కామారెడ్డి జిల్లా ఎస్పి సింధు శర్మ ఎన్నికల నిర్వహణలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శించి మంగళవారం రాత్రి 8:30 గంటలకు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. డి.ఎస్.పి శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ లతో స్టేషన్లో ని పలు కేసులు, ఎలక్షన్లో సంబంధించిన వివరాలు మాట్లాడి తెలుసుకున్నారు. ఎస్పి సింధు శర్మ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంలో ఉండి సక్రమంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు చూడాలని ఆమె సూచించారు.
పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని బైండోవర్ చేయాలని ఎస్పీ సూచించారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లోని క్రైమ్ కు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ వారి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు. అన్ని చెక్ పోస్ట్ వద్ద పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించాలని, ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనలు చేశారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోలీసు బలగాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలియజేశారు. ఎల్లారెడ్డికి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయో అన్ని తనిఖీ చేయాలన్నారు.