Thursday, January 16, 2025

NZB | నవంబర్ నెల వేతనాలు చెల్లించాలి.. ఆర్పీల ధర్నా..

నిజామాబాద్ ప్రతినిధి, జనవరి16 (ఆంధ్రప్రభ) : పెండింగ్ లో ఉన్న నవంబర్ నెల వేతనాలు చెల్లించాలని రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) డిమాండ్ చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు అనుబంధంగా పనిచేస్తున్న మెప్మా ఆర్పీల నవంబర్ నెల వేతనాలు విడు దల చేయాలని జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సర్వేను తామే చేస్తున్నామ‌ని తెలిపారు. కానీ ప్రభుత్వ నుంచి తమ వేతనం విడుదలైనా నిజామాబాద్ పీడీ రాజేందర్ మాత్రం నవంబర్ నెల వేతనాలు విడుదల చేయడం లేదని వాపోయారు. ఈ విషయమై తాము అడిగితే సమగ్ర కుటుంబ సర్వే చేయలేదని చెబుతున్నారని తెలిపారు. సర్వేను కేవలం 14మంది మాత్రమే వివిధ ఆరోగ్య కారణాల వల్ల చేయలేదని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినా అధికారులు తమపై వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.

నవంబర్ నెలకు సంబంధించి టూ డైరీలు సమర్పించిన, ప్రభుత్వానికి పంపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తమ పెండింగ్ వేతనాలు వచ్చే దాకా తాము నిరసన కార్యక్రమా లు చేపడతామని తెలిపారు. అంతేకాకుండా ఈ విషయమై న్యాయం చేయాలని అదనపు కలెక్టర్ కూడా వినతిపత్రం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్పిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement