Saturday, November 23, 2024

బిజెపిలో చేరిన ఆలూరు గంగారెడ్డి కుమార్తె విజయభారతి

భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశం లో చేస్తున్న అభివృద్ధిని చూసి, తన తండ్రి కోరిక మేరకు తాను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరినట్లు ఆలూరు గంగారెడ్డి కుమార్తె విజయభారతి తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల ఎమ్మార్ గార్డెన్స్ లో నేడు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ అరవింద్ సమక్షంలో ఆలూరు కు చెందిన విజయభారతి బిజెపి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా విజయభారతి మాట్లాడుతూ తన తండ్రి ఆలూరు గంగారెడ్డి ఎప్పుడు నాతో చెప్తూ ఉండేవాడని ఏదైనా రాజకీయ పార్టీలలో చేరితే అది బిజెపి పార్టీలో మాత్రమే చేరాలని నాకు చెప్పేవాడని ఆమె అన్నారు. బిజెపి పార్టీలో చేరడం నాకు ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో బిజెపి పార్టీని బలోపేతం చేసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అంతేకాకుండా నాపై అభిమానంతో నేను బిజెపిలో చేరబోతున్నానని విషయం తెలిసి నా వెంట వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.


ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి దివంగత ఆలూరు గంగారెడ్డి కుమార్తె బిజెపిలో చేరినట్లు చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేసి సంపాదన ధ్యేయంగా అధికార దుర్వినియోగం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్లో కనుమరుగవుతుందని, బిజెపి పార్టీ అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ హోదాలో ఆలూరు గ్రామంలో పథకాలను ప్రారంభించేందుకు వెళ్లినప్పుడు ఇస్సాపల్లి వద్ద స్థానిక ఎమ్మెల్యే దాడి చేయించి ఆలూరు గ్రామానికి వెళ్లనివ్వలేదనీ ఈ రోజు ఆలూరు గ్రామ ప్రజలు న దగ్గరికి వచ్చారనీ అన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు బిజెపి లో చేరాలి తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేస్తామని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని చూడకపోవడం,ఆయన చెప్పినవి వినకపోవడం, ఆయన గురించి ఆలోచించకపోవడం ఆరోగ్యానికి మంచిది అన్నారు.

కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులు ఒక కళగా మిగిలిపోయిందనీ విమర్శించారు. రెండోసారి ఎన్నికలకు వచ్చినప్పుడు
2018 లో ఖాలీ ప్లాట్ వుంటే 5 లక్షలు ఇస్తామని మాటమా ర్చరన్నరు. కేంద్రం ఇచ్చిన డబ్బులతో 12000 కోట్లతో ఇల్లు కట్టాల్సి ఉంటే వాటిని కాలేశ్వరం ప్రాజెక్టుకు వాడుకున్నారని ఆరోపించారు. ఆర్మూర్ ప్రజలను బెదిరిస్తే ఊరుకోరని ఎన్నికల సమయంలో వారి సత్తా చూపిస్తారని అన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో మామిడిపల్లి, పెర్కిట్ గ్రామాలను విలీనం చేసినప్పుడు పది కోట్ల నిధులు కేటాయిస్తారని ఇప్పటికి ఇవ్వలేదని అన్నారు.

ఆర్మూర్లో అభివృద్ధి పనులన్నీ అలాగే ఉన్నయని ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేవని అన్నారు. ఆర్మూర్ వంద పడకల ప్రభుత్వాసుపత్రి కేవలం పేరుకే తప్పఅందులో ఉండాల్సిన అంత డాక్టర్లు, సిబ్బంది లేరని ఆరోపించారు.మరోకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న గుట్టలను ఖాళీ చేస్తారని అన్నారు.లెదర్ పార్కుకు కేంద్రం నుంచి మూడుసార్లు డబ్బులు వచ్చి వెనక్కి వెళ్లాయని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వాటా ఇవ్వలేదన్నారు.నిరుద్యోగ భృతి ఇప్పటికీ ఇవ్వలేదని అడిగితే విధివిధానాలు రూపొందుతున్నాయని కేసీఆర్ అంటున్నారని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను దేశంలో ఎవరు నమ్మరని అన్నారు.
పసుపు బోర్డు, స్పైసెస్ బోర్డు ఒకటేనని పసుపు రైతులకు తెలియజేస్తున్నాను అన్నారు.
కేంద్ర మంత్రి పసుపు మద్దతు ధర కోసం లెటర్ ఇవ్వాలని అడిగిన సీఎం కేసీఆర్ లెటర్ రాయడం లేదని అన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రైతులకు ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. వీళ్ళ అవినీతితో లక్కంపల్లి సెజ్ లో ఇప్పటి వరకు ఒక్క ప్రోసెసింగ్ యూనిట్ రాలేదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఎంపీ అరవింద్ సమక్షంలో ఆలూరు గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయభారతి మద్దతు దారులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement