నిజామాబాద్ సిటీ : నకిలీ స్టిక్కర్ లతో వాహనాలు దొంగతనాలకు పాల్పడ్డ ముఠాను పట్టుకున్నట్లు సిపి నాగరాజు తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి నాగరాజు వివరాలు వెల్లడించారు. జిల్లాలో భారీ వాహనాలు టార్గెట్ చేసి మహారాష్ట్రకు చెందిన ఆజ్రత్ అలీఖాన్, నగరానికి చెందిన షేక్ సమద్ ఖాన్, హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ లతీఫ్ ముగ్గురు బొలెరో, లారీ వాహనాలను దొంగతనం కేసులో నిందితులని తెలిపారు. వీరు ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. ఖానాపూర్ చౌరస్తా వద్ద హజ్రత్ అలీ ఖాన్, షేక్ సమాద్ ఖాన్ ఇద్దరు లారీని దొంగతనం చేసి, తీసుకెళ్తుండగా, అనుమానం వచ్చి రూరల్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీరి నుంచి ఒక లారీ, ఒక ఐ20 కార్, వాహనాల దొంగతనానికి ఉపయోగించే డూప్లికేట్ నంబరు గల స్టిక్కర్లను సైతం స్వాధీనం పరుచుకున్నట్లుగా సిపి నాగరాజు తెలిపారు. మరో నిందితుడు అబ్దుల్ లతీఫ్ పరారీలో ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ కేసుని చేదించుటలో ముఖ్య పాత్ర వహించిన J.నరేష్, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, సౌత్ రూరల్ నిజామాబాద్, SIP లింబాద్రి, సురేష్ SIP CCS , సిబ్బంది అందరిని గపోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు IPS అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అరవింద్ బాబు, ఏసిపి వెంకటేశ్వర్లు, సౌత్ సీఐ నరేష్, రూరల్ ఎస్ఐ లింబద్రీ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital