Tuesday, November 26, 2024

NZB: ఆంక్షలు లేని రుణమాఫీ ఇవ్వాలి.. ఎమ్మెల్యే ధనపాల్

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 20(ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు లేని రుణమాఫీ రైతులకు వెంటనే అందజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య‌నారాయణ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన అంటు తెలంగాణ ప్రజలను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బీజేపీ విలీనమంటూ ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు.

మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… కాంగ్రెస్ నాయకులు పదేపదే ఇందిరమ్మ రాజ్యమని మాట్లాడుతున్నారన్నారు.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన వచ్చేలా ఉందని విమర్శించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలతో యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెందార‌న్నారు.

కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఈ రాష్టంలో ఆత్మహత్యలు తప్ప ఇంకా ఏమి మిగలవన్నారు. ఇప్పటికే కర్ణాటకలో 1200 మంది రైతులు ఆత్మహ‌త్యలు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన, ఆత్మహ‌త్య‌ల పాలన, దోపిడీ పాలన అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

భూ అక్రమార్కుల బాగోతాన్ని బయటపెట్టాలి…
నిజామాబాద్ నగరంలోని భూ అక్రమార్కుల చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య‌నారాయణ డిమాండ్ చేశారు. నాగారం బొందెం చెరువు కబ్జాల వెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి సామాన్య ప్రజలను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మోసపోయిన ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ కు విన‌తిపత్రం అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement