నిజామాబాద్ ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరో ఇద్దరు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్లో ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి 10వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రాజేందర్ అనే రైతు తన ఐదు గుంటల భూమికి సరిహద్దు సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఏడీ శ్యాంసుందర్ రెడ్డితో పాటు సూపరింటెండెంట్ వెంకటేష్, జూనియర్ అసిస్టెంట్ రహీమాలు లంచం డిమాండ్ చేశారు. వీరి వేధింపులు తట్టుకోలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. ఈరోజు రూ.10వేలు లంచం తీసుకుంటూ ముగ్గురు ఏసీబీకి చిక్కారు. ఈ ముగ్గురిని కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
- Advertisement -