Monday, July 8, 2024

NZB: జాతీయ హాకీ పోటీలకు తూంపల్లి పాఠశాల విద్యార్థుల ఎంపిక..

సిరికొండ, జులై 5 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ హాకీ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు నగేష్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం… ఈనెల 23న హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల హాకీ స్టేడియంలో తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ జూనియర్ నేషనల్ హాకీ క్రీడల ఎంపిక పోటీల్లో తూంపల్లి పాఠశాలకు చెందిన హకీ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి సౌత్ జోన్ హాకీ పోటీలకు ఎంపికైనట్లు ఆయన చెప్పారు.

జాతీయ హాకీ పోటీలకు అక్షయ, రాజశ్రీ, శ్రీజ, మనోజ్, నితిన్ అనే విద్యార్థులు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 10 నుంచి 17 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో నిర్వహించనున్న జాతీయ హాకీ క్రీడల పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు ఆయన వివరించారు. తూంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ హాకీ క్రీడలకు ఎంపిక కావడం పట్ల నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, కార్యదర్శి ఎస్.రమణ వీడీసీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారని వ్యాయామ ఉపాద్యాయుడు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement