Tuesday, November 12, 2024

NZB | ప్రజలకు ఏం చేశారని ఉత్సవాలు.. ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 12:(ఆంధ్రప్రభ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఏం చేశారని ఉత్సవాలు నిర్వహిస్తారని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెసోళ్లు దోపిడీలో బ్రిటిషోల్లని మించి పోయారని ఎద్దేవా చేశారు. స్కామ్ లు, కమిషన్లు, దోపిడీపై ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై లేదన్నారు.

మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనపై అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పో యిన కాంగ్రెస్ ప్రభుత్వం 26 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తాననడం సిగ్గుచేటన్నారు. ఏ మోఖం పెట్టుకొని ఉత్సవాలు నిర్వహిస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

బీజేపీ సమగ్ర సర్వేకు వ్యతిరేకం కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల దృష్టి మళ్లించడానికి సమగ్ర సర్వే కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ డైవర్ట్ పొలిటికల్ కార్యక్రమం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో నాగోళ్ళ లక్ష్మీ నారా యణ, మాస్టర్ శంకర్, ఇల్లెం దుల ప్రభాకర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement